Raksha Bandhan: రక్షాబంధన్ విశిష్టత..!! అన్నా, తమ్ముళ్లకు రాఖీ ఎందుకు కడతారో తెలుసా..!!

Share

Raksha Bandhan: రక్షాబంధన్.. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పండగ.. ముఖ్యంగా స్త్రీలు రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు.. తమ అన్నదమ్ములకు ఏ రాఖీ కట్టాలి.. ఏ స్వీట్ తినిపించాలి అంటూ తెగ ఆరాటపడుతూ ఉంటారు.. రాఖీ పండుగ అంటే కేవలం నుదిటి మీద బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించడమేనా..? అసలు రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు..!? అన్నా, తమ్ముళ్లకు సోదరీమణులు దారపు పోగులే ఎందుకు కట్టాలి..!? రాఖీ పండగ వెనుక ఉన్న పురాణాల ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Why Sisters Tie Raksha Bandhan: to her Brothers
Why Sisters Tie Raksha Bandhan: to her Brothers

పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారంతో కలిసి అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి ఒక ఉపాయం ఆలోచించి, రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడు యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు సాగనంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది. ఇలా దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్లిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటినుంచి ఇప్పటివరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు.. రాఖీ పౌర్ణమి శ్రావణ పూర్ణిమ అని జంధ్యాల పూర్ణిమ అని పిలుస్తూ ఉంటారు. ఇదే రోజున హయగ్రీవ జయంతి.

 

మహాభారతంలో ద్రౌపది, శ్రీ కృష్ణుల అన్నాచెల్లెల అనుబంధం గొప్పది. శిశుపాలుని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడి చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి, తక్కిన వారంతా కంగారుపడి గాయానికి మందు తీసుకురావడానికి తలో దిక్కు వెళ్తారు.. అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుడు వేలికి కడుతుంది. దీనికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని మాట ఇస్తాడు. అందుకే కురుసభలో ద్రౌపతి వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను శ్రీకృష్ణభగవానుడు ఆదుకున్నాడు..

Why Sisters Tie Raksha Bandhan: to her Brothers
Why Sisters Tie Raksha Bandhan: to her Brothers

రాక్షస రాజైన బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినపుడు దానవుల నుంచి మనుషులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి అవతారంలో భూమి మీదకు వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఓ బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి వద్దకు వెళుతుంది. శ్రావణపౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి తనెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. బలి చక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళమని బలిచక్రవర్తి కోరతాడు.

 

ఇంతటి గొప్ప ప్రాశస్త్యం ఉన్న రాఖీ ని సోదరీమణులు సోదరులుగా భావించిన ప్రతి ఒక్కరికి కడతారు.. సోదరి “ఏదో బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలాఃతేనత్వం అనుబంధమి రక్షమాంచమాంచలం”అంటూ రక్ష కోరిన తన సోదరిని బలి చక్రవర్తి రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలు ఎదురైనా తడబడక ధైర్యంతో ఎదురు నిలిచాడు.. అటువంటి మహావీరునితో తన సోదరుడుని పోలుస్తూ సోదరి తనకి రక్షణ నివ్వమని కోరుతూ రాఖీ కడుతుంది.. రాఖీ కట్టడం అంటే ఆర్భాటం కాదు అనుబంధాన్ని పెనవేసేందుకు చిన్న దారమైన సరే చాలు.. చిన్న దారంతో కొట్టడం ఎంతో సోదర బంధం జన్మజన్మల పెనవేసుకుపోతుందని.. ఎల్లకాలం సోదరీమణుల ను కంటికి రెప్పలా అన్నాతమ్ముళ్ళు కాపాడుకుంటారని నమ్మకం..


Share

Related posts

Munnar : మున్నార్ వెళ్తే ఈ ప్రదేశాలను తప్పకుండా చూడండి !! (పార్ట్2)

Kumar

మోదీ కొత్త ఎత్తుగ‌డ‌కు కేసీఆర్ షాక్ అవ్వాల్సిందే ..

sridhar

చార్‌ధామ్‌ దేవాలయాలకు అంబాని రూ.5 కోట్లు విరాళం !

Sree matha