Wild Dog : ప్రయోగాత్మక చిత్రాలలో నటించేందుకు నాగార్జున ఎప్పుడూ ముందుంటారు.. తాజాగా నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం వైల్డ్ డాగ్.. ఈ సినిమా వెండితెరపై కనిపించేందుకు చిత్రబృందం ఎంత కష్ట పడిందో వివరిస్తూ ఓ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు.. తెర వెనుక కథ అంటూ నాగార్జున, నిరంజన్ రెడ్డి, అహిషోర్, దియా మీర్జా, సయామీ ఖేర్, అలీ రెజా అతుల్ కులకర్ణి వంటి నటులు తమ అనుభవాలను వివరించారు..

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఇ ఈ చిత్రాన్ని నిర్మించారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ఎన్ఐఏ బృందం సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో సాగుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి తెరవెనుక ఏం జరిగిందో మీరు ఒకసారి చూసేయండి.. ఈ వీడియో మీకోసం..