మారుతున్న కాలంతో పాటే మనుషుల జీవితంలో అందానికి ప్రాధాన్యత పెరుగుతోంది. యువకులతో పోలిస్తే యువతులు అందానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఇతరులతో పోలిస్తే అందంగా కనిపించాలనే ఉద్దేశంతో మార్కెట్లో దొరికే క్రీములను, సబ్బులను విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖంపై చిన్న మొటిమ వచ్చినా మచ్చ కనిపించినా నామోషీగా ఫీల్ అవుతున్నారు. అన్నీ ఉపయోగించినా అందంగా కనిపించకపోతే సర్జరీల వైపు పరుగులు తీస్తున్నారు.
అయితే 100కు 90 శాతం మందికి సర్జరీలు సఫలమై అందంగా మారితే కొందరు మాత్రం సర్జరీలు ఫెయిల్ కావడంతో ఉన్న అందం కూడా కోల్పోయి బాధ పడాల్సి వస్తోంది. తాజాగా ఒక యువతి అందం కోసం ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నానా..? అని బాధ పడుతోంది. చైనా లోని హాంగ్ జు నగరంలో జావో అనే యువతి నివశించేది. ఆమెకు తన ముఖం అందంగానే ఉన్నా ఇంకా అందంగా కనిపించాలనే కోరిక ఉండేది.
దీంతో ఇప్పటికే పలుమార్లు ముఖానికి సర్జరీ చేయించుకుంది. అయితే ఎంత ఎంత అందంగా ఉన్నా జావోకు ఇంకా అందంగా కనిపించాలనే ఆలోచన మరింత పెరిగింది.దీంతో ముడతలు తొలగించుకోవడం కోసం ఆపరేషన్ చేయించుకుంది. జావో ముడతలు తొలగించడం కోసం చేయించుకున్న ఆపరేషన్ వికటించింది. వైద్యులు సూది మందులు ఇచ్చి ఆమె ముఖానికి చికిత్స చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆపరేషన్ ఫెయిలైంది. దీంతో అందంగా కనిపించాల్సిన ముఖం కాస్తా అందవిహీనంగా కనిపిస్తోంది.
ముఖంలో సగభాగం వంకర పోవడంతో పాటు కన్ను కూడా మూయలేని పరిస్థితి ఏర్పడింది. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఫేషియల్ నెర్వ్ పెరాలసిస్ వక్ఛినట్టు గుర్తించారు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని యువతి తన జీవితంపై తనకే విరక్తి పుడుతోందని.. అద్దంలో ముఖాన్ని చూసుకుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని వెల్లడించింది.