టాలీవుడ్ హీరోల అభిమానులు ఈమధ్య సోషల్ మీడియాని ఏకగ్రీవంగా ఏలుతున్నారు. ఇండియాలో మరే ఇండస్ట్రీకి సాటి కాని రీతిలో ట్విట్టర్లో రికార్డుల మీద రికార్డులను బద్దలు కొడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఔరా అనిపించే రేంజ్ లో ప్రతి ట్రెండ్ తో కొత్త రికార్డులను వస్తున్నారు.
రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బర్త్ డే ట్రెండ్ లో ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా 59.21/60.20 మిలియన్ ట్వీట్స్ ను వేసి బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డులలో భారత్ లో మొదటి స్థానం ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో/మొదటి స్థానంలో (కాంట్రవర్సీ ఇంకా నడుస్తోంది) నిలవగా పవన్ ఫ్యాన్స్ ఈ రికార్డులను బ్రేక్ చేసి టాలీవుడ్ లో క్రేజ్ విషయంలో పవన్ కి ఎదురులేదు అన్న విషయాన్ని మరోసారి నిరూపించారు.
వరల్డ్ రికార్డు నమోదు చేసేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 24 గంటల్లో దాదాపు 61 మిలియన్ల ట్వీట్లను వేయవలసి ఉంటుంది. ఇందులో ట్వీట్ల తో పాటు రీట్వీట్లను కూడా లెక్కిస్తారు. 20 గంటల 45 నిమిషాల్లోనే 50 మిలియన్ ట్వీట్స్ వేసిన పవన్ ఫ్యాన్స్ అత్యంత వేగంగా 10, 20, 30, 40 మిలియన్ల ట్వీట్స్ వేసిన ఘనత కూడా సాధించారు.
ఆ తర్వాత 24 గంటలు పూర్తి కాకముందే ప్రపంచ రికార్డు 60.20/60.3 ని బద్దలు కొట్టడం గమనార్హం. ఇంకా ఒక అరగంట సేపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఊపులో ఆ సెలబ్రేషన్స్ లో మరిన్ని మిలియన్లకు ట్వీట్లు వేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ రికార్డును బద్దలు కొట్టడానికి ఏ హీరో ఫ్యాన్స్ రెడీగా ఉన్నారో చూడాలి. మొత్తానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనికి చేరుస్తారు. ఇక మొత్తం ట్వీట్ కౌంట్ సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వస్తుంది.