28.2 C
Hyderabad
February 4, 2023
NewsOrbit
ట్రెండింగ్

Usain Bolt: కోట్లు పోగొట్టుకున్న ప్రపంచ స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్… ఆర్థిక మోసాలకు బలవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

Share

Usain Bolt: ప్రపంచ స్టార్ అథ్లెట్ ఒలంపియాన్.. అత్యంత వేగవంతమైన పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ అందరికీ సుపరిచితుడే. రన్నింగ్ రేస్ లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన ఈ లెజెండ్ స్ప్రింటర్ మోసపోయాడు. ఓ స్టాక్స్ లో పెట్టిన పెట్టుబడి … దాదాపు 12 మిలియన్ డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీలో 103 కోట్ల రూపాయలు మేరా.. డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. పదవీ విరమణ జీవితకాల సేవింగ్స్ కింద జమైకా రాజధాని కింగ్ స్తాన్ లో “స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్” (SSL) అనే పెట్టుబడుల సంస్థలో ఉసేన్ బోల్ట్.. డబ్బులు పొదుపు చేశారు.

 World star athlete Usain Bolt who has lost millions How to protect yourself from Financial Scam
World star athlete Usain Bolt who has lost millions

ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట చూస్తే.. 12 వేల డాలర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థ. దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కంపెనీ మాజీ ఉద్యోగి ఈ దారుణ మోసానికి పాల్పడినట్లు వెల్లడయ్యింది. దీంతో తన డబ్బులు తిరిగి చేయాలంటూ బోల్ట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. ఆ మాజీ ఉద్యోగికి పది రోజులు గడువు విధించారు. ఇచ్చిన సమయంలో కల్లా డబ్బులు తిరిగి చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం జరిగింది. అయితే ఈ మోసానికి పాల్పడిన కంపెనీ మాజీ ఉద్యోగి బోల్ట్ ఒక్కరి ఖాతాలో మాత్రమే కాదు ఇంకా 29 మంది ఖాతాలో నగదు దోచుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

World star athlete Usain Bolt who has lost millions How to protect yourself from Financial Scam
Usain Bolt Loses Nearly $10 Million In Investment Fraud

ఖాతాదారుల ఆర్థిక భద్రతను కూడా కాపాడుకోలేకపోవటంతో స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థనీ జమైకా ప్రభుత్వం.. తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ విధానం వచ్చిన తర్వాత చాలామంది మోసపోతున్నారు. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు..హ్యాకర్ల బారిన పడుతున్నారు. దీంతో వ్యక్తిగత సమాచారంతోపాటు డబ్బులు పోగొట్టుకునే పరిస్థితులు దాపరిస్తున్నాయి. అయితే ఇటువంటి మోసాలకు బలికాకుండా ఉండాలంటే.. వ్యక్తిగత సమాచారం ముఖ్యంగా భారతీయులైతే ఆధార్ కార్డు నెంబర్ ఇంకా ఫోటోలు.. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికిబడితే వారికి ఇవ్వకూడదు.

World star athlete Usain Bolt who has lost millions How to protect yourself from Financial Scam
Be Alert International Credit Card Transactions
ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ లావాదేవీ లలో అలెర్ట్ గా ఉండాలి:

ఇంకా క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా వెబ్ సైట్ లో కొనుగోలు చేసిన క్రమంలో సదరు వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైన క్రెడిట్ కార్డ్ లో డబ్బులు మొత్తం మాయం చేసేస్తారు. క్రెడిట్ కార్డు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటర్నేషనల్ పరంగా క్రెడిట్ కార్డ్ వాడే విషయంలో లిమిట్ అమౌంట్ ముందే సెట్ చేసుకోవటం మంచిది. ఈ క్రమంలో హ్యాకింగ్ కి కార్డు గురైన గాని ఎక్కువ మొత్తంలో.. డబ్బులు తీసుకునే ఛాన్స్ ఉండదు.

World star athlete Usain Bolt who has lost millions How to protect yourself from Financial Scam
Don’t Use Public Mobile Charging
ఎక్కడపడితే అక్కడ ఫోన్ చార్జింగ్ పెట్టకూడదు:

చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రెస్టారెంట్ లలో, రైల్వే స్టేషన్ ఇంకా పలు పబ్లిక్ ప్లేస్ లలో చార్జింగ్ పెట్టుకుంటారు. అయితే హ్యాకర్లు ఆల్రెడీ ఆ ఛార్జింగ్ పాయింట్ లో చీప్ పెట్టి ఫోన్ హ్యాక్ చేసే పరిస్థితి ఉందట. ఈ రకంగా హైదరాబాద్ లో ఓ బ్యాంకు సీఈవో ఖాతా నుండి 16 కోట్ల రూపాయలు హ్యాకర్లు దోచుకున్న వార్త గతంలో వైరల్ అయింది. సో చార్జింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పవర్ బ్యాంక్ .. లేదా సొంతంగా చార్జింగ్ పాయింట్ ఉండేలా చూసుకోవాలి.

World star athlete Usain Bolt who has lost millions How to protect yourself from Financial Scam
Don’t Open Unnecessary Internet Links
ప్రతి లింకు ఓపెన్ చేయకూడదు:

ఇటీవల హ్యాకర్స్ కొన్ని లింక్స్ పంపించి ఫోన్ మొత్తం తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. ఎలక్ట్రిక్ బిల్ కట్టలేదని ఇంకా డబ్బులు గెలుచుకున్నట్లు కొన్ని లింక్స్ మెసేజ్ రూపంలో పంపించి వాటిని క్లిక్ చేసిన వారి ఫోన్ మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. ఈ రకంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం తెలుసుకుని బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం గుంజేస్తున్నారు.

World star athlete Usain Bolt who has lost millions How to protect yourself from Financial Scam
Dont tell OTP’S
ఎవరికి పడితే వారికి OTPలు చెప్పకూడదు:

చాలావరకు ఇతరహా మోసం గ్రామీణ ప్రాంతాలలో జరుగుతూ ఉంది. ప్రభుత్వ కార్యాలయాలనుండి ఫోన్ చేసినట్లు మీకు పథకం వర్తించినట్లు ఓటిపి చెబితే.. మీరు డబ్బులు తీసుకోవచ్చని హ్యాకర్లు భారీ ఎత్తున మోసానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడ కూడా ఓటీపీ విషయంలో తెలియని నెంబర్లనుండి ఎవరికి చెప్పకూడదని బ్యాంక్ అధికారులు సైతం ఖాతాదారులకు అలర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా మాత్రం ఓటీపీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

World star athlete Usain Bolt who has lost millions How to protect yourself from Financial Scam
RBI Guide Lines Bank Refund
మూడు రోజుల్లో మేలుకుంటే మీ డబ్బు మీ ఖాతాలోకి:

మీ ప్రమేయం లేకుండా మీ.. అకౌంట్ నుండి డబ్బులు విత్ డ్రా అవుతున్న.. మూడు రోజుల్లో ఈ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా చేసినట్లయితే RBI రోల్ ప్రకారం.. మీరు కోల్పోయిన డబ్బును.. తిరిగి బ్యాంకు చెల్లించేస్తాది. మూడు రోజులు దాటితే మాత్రం కష్టం. సో బ్యాంకు నుండి మన ప్రమేయం లేకుండా మన ఖాతాలో డబ్బులు పోతున్నట్లయితే వెంటనే బ్యాంకుని సంప్రదించటం అనేది మంచిది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం.. తిరిగి డబ్బులు మన ఖాతాలోకి రావు.


Share

Related posts

Jujube Fruit: ఈ సీజన్ లో వచ్చే ఈ పండు తింటే కలిగే లాభాలివే..!!

bharani jella

Devatha Serial: దేవి సత్యకి దత్తత విషయం చెప్పేసిందా..!? రాధ అడ్డుపడలేదా..!?

bharani jella

క్యాష్ షోలో బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ల సందడి.. 2 ఏళ్ల తర్వాత మళ్లీ అంతా కలిశారు?

Varun G