శరీర శుభ్రతకు ప్రతీ ఒక్కరూ ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు.. ఇవ్వాలి కూడా.. ఎందుకంటే అదే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే రోజులో ఒక్కసారైనా స్నానం చేయాలని వైద్యులు చెబుతుంటారు. అందుకే ప్రతీ ఒక్కరూ స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు.
అయితే కాస్త బద్దకస్తులైతే రెండు రోజులకోసారైనా స్నానం చేస్తారు. కానీ స్నానం చేయని వారిని వారి నుంచి వచ్చే చమట కంపే చూపిస్తుంది. దగ్గరకు ఎవరిని రానివ్వదు. ఆ చమట కంపు బాధకైనా.. రోజు స్నానం చేస్తుంటారు చాలా మంది.
అయితే ఒక వ్యక్తి 65 ఏండ్ల నుంచి స్నానం చేయడం లేదంట. వామ్మో కంపు అని ముక్కు ముసుకుంటున్నారా..? ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ అనే ఒక వ్యక్తి ముచ్చట ఇది. ఇతను 65 ఏండ్ల నుంచి స్నానం చేయక పోవడంతో.. ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా పేరు పొందాడు.
ఇతనికి ఇప్పుడు 83 ఏండ్ల వయసు. స్నానం చేయకున్నా కానీ ఈ వయసు లోనూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇరాన్‌లోని దెజ్ అనే ప్రాంతంలో ఇతను నివసిస్తుంటాడు. అయితే హాజీకి 20 ఏండ్ల వయసున్నప్పుడు అనారోగ్యానికి గురయ్యాడట. ఆ అనారోగ్యానికి కారణం స్నానం చేయడమే అని భావించి.. అప్పటి నుంచి స్నానం చేయడం మానేశాడు. ఆయనకు విచిత్రమైన అలవాట్లు కూడా ఉన్నాయి. కుళ్ళిపోయిన మాంసం తినడం ఈ అలవాట్లల్లో ఒకటి. అయితే మీరు మాత్రం ఈ పని చేసేరు.. పక్కన వాళ్ళు మీ దరి దాపుల్లోకి రారు సుమా..