Yami Gautam: ఇటీవల కన్నడ బ్యూటీ ప్రణీతకు సుభాష్ రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. పెళ్లి ఫోటోలు తన స్నేహితుడి ద్వారా బయటకు వచ్చేవరకు తను పెళ్లి చేసుకున్న విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.. తరువాత పెళ్లి చేసుకున్నట్లు ప్రణీత సుభాష్ అందరికీ తెలియజేసింది.. తాజాగా మరో హీరోయిన్ రహస్యంగా పెళ్లి చేసుకుంది.. బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ ఈ రోజు వివాహం చేసుకున్నారు ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు..
ఫేర్ అండ్ లవ్లీ యాడ్ చూడగానే ఇట్టే గుర్తొస్తుంది యామి గౌతమ్.. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం తో పాటు నితిన్ సరసన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా లో యామి గౌతం నటించింది. ట్విట్టర్లో యామి గౌతమ్ నిరాడంబరంగా మా పెళ్లి జరిగింది. మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ట్వీట్ చేశారు.. ఆదిత్య – యామి ఎప్పటి నుంచో ప్రేమ లో ఉన్నట్టు ప్రచారం జోరుగా జరిగింది. నేటితో వారిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ భామ హిందీ సినిమాల్లో చాలా బిజీగా ఉంది.