జైపూర్ : రాజస్థాన్ లో పోలింగ్ ప్రశాంతం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సీఎం అభ్యర్థి వసుంధరారాజే ఉదయమే తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, జశ్వంంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ తదితరులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరిగినట్లు సమాచారం లేదు. ఓటర్లు ఉదయం నుంచే ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరి కనిపించారు. ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య సాగుతోంది. ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.