మంచు గుప్పిట్లో సిక్కిం

సిక్కిం మంచు గుప్పిట్లో చిక్కుకుంది. గాంగ్టకు కు సమీపంలోని నాథులా వద్ద మంచు విపరీతంగా కురవడంతో వేలాది మంది చిక్కుకుపోయారు. మంచు ఉచ్చులా మారి వాహనాలలో ఉన్న వారు కూడా బటటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు దిక్కు తోచని స్థితిలో సైన్యం సహాయం కోరారు. దీంతో సైన్యం రంగంలోనికి దిగి దాదాపు రెండున్నర వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. దాదాపుగా గడ్డకట్టుకుపోయిన స్థితిలో ఉన్నవారికి ఆహారం, వైద్య సేవలు అందించింది. ఇంత భారీగా మంచు కురవడం తాము గతంలో ఎన్నడూ చూడలేదని గాంగ్టక్ వాసులు అంటున్నారు. మరి కొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇలా ఉండగా ఉత్తర భారత దేశంపై చలిపులి పంజా విసిరింది. విపరీతమైన మంచు, చలిగాలులతో ఉత్తర భారతం వణికిపోతున్నది. ఉదయం పది గంటల ప్రాంతంలో కూడా దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాలలో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి.