రాఫేల్ వివాదం పై రక్షణ మంత్రికి సూటి ప్రశ్నలు

ఢిల్లీ, జనవరి 5 రాఫేల్ వివాదంపై కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ సూటిగా కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్‌ను ప్రశ్నించారు. లోక్ సభలో రాహల్ గాంధీ అనీల్ అంబానీకి యుద్ద విమానాల కాంట్రాక్టు ఎలా వచ్చిందీ చెప్పాలనీ, ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారో చెప్పాలన్నారు. రక్షణశాఖకు సంబంధించి కొనుగోళ్ళ విషయంలో బైపాస్ చేసి   ప్రైవేటు కంపెనీకి కాంట్రక్టు ఎందుకు కట్టబెట్టారో తేల్చి చెప్పాలన్నారు.  లోక్ సభలో రక్షణ మంత్రిని ప్రశ్నించిన అంశాలతోపాటుగా వీడియోను రాహుల్ ట్విట్ చేశారు.