ప్రశ్నించిన వారిని ఫినిష్ చేయడమే చంద్రబాబుకు తెలిసిన డెమోక్రాటిక్ కంపల్షన్ కాబోలు! ప్రతిపక్షం లేకుండా ఫినిష్ చేస్తానని నాడు అసెంబ్లీలో బెదిరించిన బాబు, ఇప్పుడు చింతమనేని స్థాయికి దిగజారి, ప్రశ్నిస్తే మహిళలను కూడా ఫినిష్ చేస్తానంటున్నాడు. పోగాలం దాపురించిన వాడు వినడు. కనడు. – విజయ సాయి రెడ్డి వి, వైఎస్ఆర్సీపీ

 

ఓ రైతు బిడ్డగా, రైతన్న సంతోషమే ధ్యేయంగా రుణమాఫీ చేశాం.. 7 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. ఆధునిక పనిముట్లను అందిస్తూ అండగా నిలబడుతున్నాం. – ఏపీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు

 

నూటికి నూరు శాతం వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చంద్రబాబే చేయించారనడానికి ఆయన మాటలే నిదర్శనం. ఇదంతా ఆపరేషన్ గరుడ అని సినిమాలు లేని శివాజీతో చెప్పించారు. ఈ కేసులో ఇప్పటి వరకు శివాజీని ఎందుకు విచారించలేదు? – ఎమ్మెల్యే రోజా

 

బహిరంగంగా వ్యాఖ్యలు చేయడానికి ముందు మను బాకర్ ముందుగా స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించి నిర్దారించుకోవాలి. దేశంలోనే అందరికన్నా ఎక్కువ అవార్డులను ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా అసహ్యకరంగా ఉంది. ఆ సమయంలో ఉన్న నోటిఫికేషన్ ఆధారంగా బాకర్‌కు రూ.2 కోట్ల బహుమతి ఇస్తామని స్వయంగా నేనే ట్వీట్ చేశాను. క్రీడాకారుల్లో కొంచెం క్రమశిక్షణ కూడా ఉండాలి. వివాదం సృష్టించినందుకు బాకర్ పశ్చాత్తాప పడాలి. – భారత షూటింగ్ సెన్సేషన్ మను బాకర్‌పై హర్యానా క్రీడా శాఖ మంత్రి అనిల్ విజ్

SHARE