ఓటమి అంచుల్లో ఆసీస్

మెల్ బోర్న్ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఒటమి దిశగా సాగుతోంది. 399 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 116 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, షమీలు చెరో వికెట్ పడగొట్టారు. అంతకు ముందు భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను106/8 వద్ద డిక్లేర్ చేసి ఆసీస్ కు 399 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసినే మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేశాడు.