గగన్‌యాన్ ప్రాజెక్ట్‌ నిధులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ఢిల్లీ, డిసెంబర్ 28: అంత‌రిక్షంలోకి వెళ్లే ముగ్గురు భార‌తీయ వ్యోమ‌నాట్ల‌ కోసం కేంద్ర ప్ర‌భుత్వం 10 వేల కోట్ల‌ రూపాయలను కేటాయించింది. ఆ బ‌డ్జెట్‌కు నేడు (డిసెంబర్ 28) కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇస్రో చేప‌ట్టే “గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టు “కోసం ఆ నిధులను కేటాయించిన‌ట్లు మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ శుక్రవారం మీడియా వెల్లడించారు. 2020లో ముగ్గురు భార‌తీయుల‌ను అంత‌రిక్షంలోకి పంపాలన్నదే ఇస్రో  లక్ష్యం. ఆ ముగ్గురు ఏడు రోజుల పాటు అంత‌రిక్షంలో ఉంటారు. ఆ ప్రాజెక్టు కోసం కావాల్సిన బ‌డ్జెట్‌ను ఇవాళ కేటాయిస్తూ కేంద్ర‌ క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకున్న‌ది.