బీజేపీ ఎమ్మెల్యే వాచాల‌త‌

Share

లక్నో,జ‌న‌వ‌రి4: ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో భద్రత లేదని భావిస్తున్న వారందరినీ బాంబులతో చంపేయాల‌న్నారు. భారత్‌లో రక్షణ లేదని అంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఒక చట్టం రూపొందించాలని కూడా డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు భారత్‌లో భద్రత లేదనీ, బెదిరింపులకులోనవుతున్నట్లు భావిస్తోన్న వారిని బంబులతో పేల్చేయాలి. నాకు మంత్రి పదవి ఇవ్వండి.. ఒక్కరు కూడా మిగలకుండా అలాంటి వాళ్లందరినీ చంపేస్తాన‌ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దేశంలో మూకహత్యలు ఎక్కువయ్యాయని, పోలీసు అధికారుల ప్రాణాల కంటే గోవుల రక్షణే ఎక్కువైందని బాలీవుడ్ న‌టుడు నసీరుద్దీన్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ఎమ్మెల్యే త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు.


Share

Related posts

Yash Remuneration: ‘కేజీయఫ్ 2’ కోసం యష్ తీసున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వలిసిందే ??

Naina

లోక్ సభ లో రేవంత్ రెడ్డి అరెస్టు గురించి చర్చ

Siva Prasad

ఈ “స్పెషల్ డేట్” గిఫ్ట్ ఇవ్వనున్న అమ్మలు… ఈ రోజున ఎంత మంది జన్మించునున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

bharani jella

Leave a Comment