NewsOrbit
Uncategorized

రాజకీయ క్రీడల క్రీనీడల్లో దేశం!

ప్రజాభిమానం నుంచి పుట్టవలసిన నాయకులు నేడు నోట్ల కట్టల నుంచి మద్యం సీసాలలో నుంచి పుడుతున్నారు. రాజకీయ నాయకులు రాజకీయాలను అత్యంత ఖరీదైన వ్యాపారంలాగా మార్చారు. మొన్న ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బే ఇందుకు సాక్ష్యం. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు, మద్యం, ఇతర వస్తువుల విలువ సుమారు 129.46 కోట్లు. ఇది కేవలం పట్టుబడిన డబ్బు మాత్రమే, పట్టుబడకుండా జారిపోయింది ఇంకెంతుందో? నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప నిజానిజాలు ఆ దేవుడికే ఎఱుక. ఈ దేశంలో ప్రజాసంక్షేమం నేతి బీరకాయలో నేతి వలె ఉంటోంది. అధికారంలోకి వచ్చే వరకే హమీలు ఇస్తూ పోతుంటారు. అధికారంలోకి రావడం కోసం ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తామంటారు. అధికారంలోకి వచ్చాక పెట్టిన పెట్టుబడిని సంపాదించుకోవటానికి ప్రజల జీవితాలతో వ్యాపారాలు చేస్తుంటారు.

ఈ క్రీడలో రక్షకుడెవరో, భక్షకుడెవరో తెలియకుండా పోతోంది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేసుకుంటుంటారు. అవి నిరూపించమంటే మాత్రం నీళ్ళు నములుతుంటారు. ఎవరు ఏ పార్టీనో తెలియకుండా పోతోంది తెల్లవారేసరికి చొక్కా మార్చినంత సులభంగా పార్టీని మార్చుతున్నారు. ప్రజా తీర్పును ధిక్కరిస్తు అధికార పార్టీలోకి ఫిరాయింపులు చేస్తున్నారు. మంత్రి పదవుల కోసం, పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవటంకోసం పెట్టుబడిదారుల్లాగా ప్రజల కష్టాన్ని దొచుకోవడానికి పార్టీలు ఫిరాయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం నియోజకవర్గ అభివృద్ధికోసమే అని ఒక అందమైన అబద్ధం ఆడతారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాల్సిన రాజ్యంగబద్ధ పదవుల్లో ఉన్న స్పీకర్‌ పార్టీలకు గులాంగిరిలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడటం కాదా? ఈ వ్యవహారంలో ప్రజలు ప్రేక్షక పాత్ర వహించక తపపటంలేదు.

కళ్ళు ఉన్నా చూడలేని న్యాయ వ్యవస్థను, అధికారాలు ఉన్నా దండించలేని పోలీసు వ్యవస్థను రాజకీయ వ్యవస్థ తన కనుసన్నల్లో నిర్వహిస్తున్న విషయం విదితమే. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఒకరు స్వతంత్రం గురించి పిచ్చాసుపత్రిలోని పిచ్చివాళ్ళ మాత్రమే మాట్లాడుకుంటారన్నారు. అన్నట్లుగా ప్రజాస్వామ్య విలువల గురించి ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు అనే పిచ్చివాళ్ళు మాత్రమే మాట్లాడుతారు. దేశంలో అవినీతి, బంధుప్రీతి పెచ్చరిల్లుతోంది. ప్రజాస్వామ్య దేశాలను విమర్శకులు ఏనాడో పిరమిడ్‌ లైసెన్స్‌ కోటా రాజ్యాంగంగా విమర్శించారు. నేతలు అవినీతి, స్క్యాంలలో పోటీ పడుతున్నారు. రాజకీయాలంటే పెట్టుబడి పెట్టి లాభాలు అర్జించే లాభసాటి వ్యాపారంలాగా భావిస్తున్నారు. ఒకరిని మించి ఒకరు పెట్టుబడి పెడుతూ అధికారంలోకి రాగానే దొరికినంతా దోచుకుంటున్నారు.

రాజరిక వ్యవస్థల్లాగ తాతలు, తండ్రులు, కొడుకులు పెట్టుబడులు పెడుతూ, ప్రజాభిమానాన్ని కొనుక్కొని రాజ్యాధికారం చేపడుతున్నారు. నాయకులు పెట్టే పెట్టుబడి ఐదు సంవత్సరాల వరకు ప్రజలను దోచుకోవడానికి ప్రజాసామ్యబద్ధంగా వారికి రాజకీయ లైసెన్సు ఇచ్చినట్లవుతోంది. ప్రజలకు ఇష్టంలేని నాయకులను వెనక్కి పిలిచే అధికారం రాజ్యంగంలో లిఖించబడినప్పటికి పునరాయణం (రికాల్‌) ఇప్పటివరకు మనదేశంలో ఎక్కడా జరగలేదు. హత్యలు చేసిన వాడు అసెంబ్లీకి, పాపాలు చేసినవాడు పార్లమెంట్‌కు వెళున్నారు. ఇది జరుగుతున్నంతకాలం ఈ దేశంలో రాజ్యంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యవ్యవస్థకు భంగం వాటిల్లుతునే ఉంటుంది. మత ప్రమేయంలేకుండా, మత ప్రసక్తి రాకుండా పాలన సాగించాలని భారతదేశాన్ని ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం ప్రకటించింది. పాలకులు మాత్రం తమ స్వార్థం కోసం దేశంలో అనేక చోట్ల మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దేశంలో ఆరని కుల, మత జ్వాలలను రగిలిస్తున్నారు. కులాల కుంపట్లు పెడుతున్నారు. నాయకులు తమ స్వార్థం కోసం మతానికో పార్టీ పెడుతున్నారు. దేశ భౌగోళిక పరిస్థితుల దృష్యా దేశాన్ని రెండు భాగాలుగా పిలుచుకుంటుంటె… రాజకీయ నాయకులు మాత్రం తమ కుటిల రాజకీయాలకోసం ప్రాంతీయ విధ్వేషాలను రెచ్చగొడుతు ఉత్తర భారతీయులు, దక్షిణ భారతీయలని వేరువేరుగా చూస్తున్నారు.

రాజకీయ ప్రయోజనాలకోసం వారికి ఇష్టం వచ్చినట్లు ప్రాంతాల అభివృద్ధికి ఆటంకపరుస్తున్నారు. ప్రజా జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రాజకీయ క్రీడల్లో పాత్రధారులు, సూత్రధారులు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులుకాగా, బలైపోయేది మాత్రం సామాన్యప్రజానీకమే. రాజకీయాలకు అసలైన అర్థం దశాబ్దాల క్రితమే మారిపోయింది. రైల్వేశాఖ మంత్రిగా తన విధులను నిర్వహిస్తున్న సమయంలో రైలు ప్రమాదానికి గురైతే అందుకు తన తప్పుగా బాధ్యత వహిస్తు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన నాయకులు ఉండిన పార్లమొంట్‌లో ఒక ప్రధాని ఇచ్చిన హమీని మరో ప్రధాని విస్మరిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అలాంటి వాటికి ఒక ఉదాహరణ.

ఇక రాజ్యంగ సంస్థలలో సైతం రాజకీయ జోక్యం కొనసాగుతోంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. అందుకే ఒక మహానీయుడు చెప్పినట్లుగా భారతదేశం సంపన్న దేశమే… కానీ భారతీయులు మాత్రం పేదవారు అంటారు. దేశంలోని సంపద కొద్ది మంది చేతుల్లో మాత్రమే కేంద్రికృతమై ఉంది. నల్లకుబేరులు లక్షల కోట్ల డబ్బును దేశం దాటించారన్న మాట వాస్తవం. ఆ డబ్బుని తిరిగి తెచ్చి ఒక్కో ఖాతాలో పదిహేనేసి లక్షలు వేస్తానన్న నరేంద్ర మోదీ ఇప్పుడు అదే ఆసాముల పల్లకీలు మోస్తూ తరిస్తున్నారు.

మరోపైపు అన్నపూర్ణ వంటి దేశంలో ఆకలి చావులు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళ, ఆమె కుమార్తెలు ఆకలితో చనిపోయారని డాక్టర్లు శవ పరిక్షలు జరిపి నిర్ధారించారు. దేశ రాజధానిలోనే ఈ పరిస్థితి ఉందంటే ఇక మారుమూల గ్రామాల సంగతి చెప్పనవసరం లేదు. దేశంలో ఆత్యాచారాలు, ఆత్మహత్యలు పరువుహత్యలు పెరిగిపోతున్నాయి. దేశంలో దారిద్య్రం, పేదరికం విలయ తాండవం చేస్తోంది. ఈ పరిస్ధితికి కారణం పాలక, ప్రతిపక్ష పార్టీలే. ఇవి రెండూ నేటి దుస్థితికి సమాన బాధ్యత వహించాల్సిందే.

-కార్తీక్ నరెడ్ల

Related posts

మొదటి రాత్రి పాలగ్లాసు వెనక ఇంత కహానీ ఉందా !

Kumar

కుటుంబం మొత్తానికి కరోనా అంటించాడు…

Siva Prasad

అబ్బెబ్బే… ఉత్తుదే…! (రాధాకృష్ణకి ఐటీ అధికారి చెప్పారట)

Srinivas Manem

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju

‘వెంకీమామ’ రివ్యూ & రేటింగ్

Siva Prasad

కంగ‌న `అప‌రాజిత అయోధ్య‌`

Siva Prasad

కేటీఆర్ స‌మీక్షా స‌మావేశంపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ట్వీట్‌

Siva Prasad

గ‌బ్బ‌ర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

Siva Prasad

బాబు చంపేస్తాడు..ఆర్‌జివి సాంగ్

anjaneyulu ram

గాల్లో పల్టీలు కొట్టిన కారు!

Mahesh

`మన్మథుడు 2` సక్సెస్‌మీట్

Siva Prasad

`28 డిగ్రీల సెల్సియ‌స్` టీజ‌ర్

Siva Prasad

ముంబైలో ‘సాహో’

Siva Prasad

వెనక్కి లాగే ప్రయత్నం చేశారు

Siva Prasad

`చిత్ర‌ల‌హ‌రి`కి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శంస

Siva Prasad

Leave a Comment