విదేశీ పర్యటన విరమించుకున్న కేసీఆర్

హైదరాబాద్, జనవరి5: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దుబాయి పర్యటన విరమించుకున్నారు. రేపు దుబాయి వెళ్లాల్సిన సీఎం కేసీఆర్ కొన్ని అనివార్య కారణాల వల్ల తన పర్యటనను విరమించుకున్నారు.

దుబాయ్‌లో జరిగే పెట్టుబడుల సదస్సుకు రాష్ట్రప్రభుత్వం తరపున అధికారుల బృందం హాజరుకానున్నారు.