అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కిష్టాయిపాలెంలో దీక్షా శిబిరంపై అమరావతి వైపు వెళుతున్న బస్సులో నుంచి ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం ఖాళీ సీసా విసిరేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు విషయాన్ని మందడంలో దీక్షలు చేస్తున్న రైతులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం ఖాళీ బాటిల్ దీక్షా శిబిరంపై విసిరేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మందడంలో గ్రామస్తులు బస్సును నిలిపివేసి, రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇప్పుడు ఖాళీ బాటిల్ విసిరివేశారు, తరువాత ఇంకా ఏమైనా దీక్షా శిబిరంపై వేసే ప్రమాదం ఉందంటూ ఆందోళన నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారించగా అతని పేరు శ్రీనివాసరెడ్డి అని, గుంటూరు జిల్లా ధరణికోటకు చెందిన వాడని తేలింది. అతను మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది.
నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులను మూడగట్టుకున్నాడు. ఈయన నుండి వచ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…