రాయలసీమపై సిఎంకు మైసూరారెడ్డి లేఖ

హైదరాబాద్,డిసెంబరు26: . రాయలసీమకు ప్రబుత్వం న్యాయం చేయడం లేదని మాజీ మంత్రి మైసూరా రెడ్డి విమర్శించారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు శివరామకృష్ణ, మదన్ మోహన్ రెడ్డి లతో కలిసి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బుధవారం లేఖ రాశారు. రాయలసీమకు నీటి పంపకాలలో అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఎపి విభజనతో రాయలసీమకు ఎక్కువ నష్టం జరిగిందని ఆయన అన్నారు. విభజన తర్వాత కూడా రాజధాని, హైకోర్టు లను కూడా ఒకే చోట పెట్టి మళ్లీ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారన్నారు. సీమలో హైకోర్టు పెట్టాలని న్యాయవాదులు కోరుతున్నా పట్టించుకోలేదన్నారు. రాయలసీమకు పట్టిసీమ నీళ్లు ఇచ్చామన్న మాట సత్యదూరమన్నారు. ఇప్పటికీ రాయలసీమ కరువుతో అల్లాడుతోందన్నారు.