NewsOrbit
Uncategorized

వెనక్కి లాగే ప్రయత్నం చేశారు

జ్యోతిలక్ష్మీ, ఘాజి, బ్లఫ్‌ మాస్టర్‌ చిత్రాలతో నటుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు సత్యదేవ్‌. ఈయన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ’47 డేస్‌’. ‘ది మిస్టరీ అన్‌ ఫోల్డ్స్‌’ అనేది ఉపశీర్షిక. ప్రదీప్‌ మద్దాలి దర్శకుడు. దబ్బార శశిభూషణ్‌ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్‌ మక్కువ, విజయ్‌ శంకర్‌ డొంకాడ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ”ఈ సినిమా చూస్తుంటే బాలచందర్‌ 47 డేస్‌ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా కోసం చిరంజీవి నా ‘మొగుడు కావాలి’ సినిమా వాయిదా వేసి మరీ చేశాడు. ఈ సినిమా కూడా ‘నా మొగుడు కావాలి’ అంత హిట్‌ కావాలి” అన్నారు. రఘు కుంచె మాట్లాడుతూ ”ఒక చిన్న ప్రయత్నంగా ఈసినిమా మొదలు పెట్టాం. చాలా ఓర్పుతో ఈసినిమాని ఇక్కడి వరకూ తీసుకొచ్చాం. ఒక క్వాలిటీ సినిమా అందించాలనే మా
ప్రయత్నంతో అనుకున్న దానికంటే కాస్త టైం ఎక్కువ తీసుకున్నాం” అన్నారు. నిర్మాతలు శశి భూషణ్‌, శ్రీధర్‌,విజయ్‌ మాట్లాడుతూ ”క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా అంతా చాలా గ్రిప్పింగ్‌ ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుంతా అనే నమ్మకం ఉంది” అన్నారు. దర్శకుడు ప్రదీప్‌ మద్దాలి మాట్లాడుతూ ”నాకు అండగా నిలబడ్డ అందరికీ థాంక్స్‌. నాకు సపోర్ట్‌ గా నిలిచిన టీంకు థాంక్స్‌” అన్నారు. హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ ”ఈ సినిమా విషయంలో నేను హీరోగా అనగానే చాలా మంది వెనక్కులాగే ప్రయత్నం చేశారు. కానీ నాతోనే ఈసినిమా చేయాలని గట్టిగా పట్టుబట్టి చేశాడు. ప్రదీప్‌ చేసే పనిలో చాలా క్లారిటీ ఉంటుంది” అన్నారు.

author avatar
Siva Prasad

Related posts

మొదటి రాత్రి పాలగ్లాసు వెనక ఇంత కహానీ ఉందా !

Kumar

కుటుంబం మొత్తానికి కరోనా అంటించాడు…

Siva Prasad

అబ్బెబ్బే… ఉత్తుదే…! (రాధాకృష్ణకి ఐటీ అధికారి చెప్పారట)

Srinivas Manem

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju

‘వెంకీమామ’ రివ్యూ & రేటింగ్

Siva Prasad

కంగ‌న `అప‌రాజిత అయోధ్య‌`

Siva Prasad

కేటీఆర్ స‌మీక్షా స‌మావేశంపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ట్వీట్‌

Siva Prasad

గ‌బ్బ‌ర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

Siva Prasad

బాబు చంపేస్తాడు..ఆర్‌జివి సాంగ్

anjaneyulu ram

గాల్లో పల్టీలు కొట్టిన కారు!

Mahesh

`మన్మథుడు 2` సక్సెస్‌మీట్

Siva Prasad

`28 డిగ్రీల సెల్సియ‌స్` టీజ‌ర్

Siva Prasad

ముంబైలో ‘సాహో’

Siva Prasad

`చిత్ర‌ల‌హ‌రి`కి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శంస

Siva Prasad

డీకే ఇంట్లో భారీగా సొమ్ము?

Kamesh

Leave a Comment