NewsOrbit
Uncategorized టాప్ స్టోరీస్ న్యూస్

సచివాలయ భవనాల పనులకు శ్రీకారం

అమరావతి, డిసెంబరు27: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పాలనా నగర నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పరిపాలనా నగరంలోని అత్యంత కీలకమైన సచివాలయ భవనాలకు ర్యాఫ్ట్ ఫౌండేషన్‌ను కాంక్రీట్‌తో నింపే పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయపూడి దగ్గర గురువారం ప్రారంభించారు. ఐదు టవర్లుగా నిర్మించే సెక్రటేరియట్ కోసం భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్‌ను నిర్మించనున్నారు. భూమి ఉపరితలం నుంచి 13 అడుగుల లోతులో . 12వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌తో నాలుగు మీటర్ల మేర నిర్మించబోతున్నారు. రాజధాని ప్రాంత పరిధిలోని 41 ఎకరాల్లో 69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఐదు భారీ టవర్ల కోసం ఈ ఫౌండేషన్‌ను స్థాపిస్తున్నారు. ఈ భారీ టవర్లలో నాలుగు 40 ఫ్లోర్స్, ఒకటి 50 ఫ్లోర్స్ గా నిర్మాణం చేయనున్నారు.
ర్యాఫ్ట్ ఫౌండేషన్ అంటే..
ఇది దేశంలోనే అతిపెద్ద నిర్మాణంగానిర్ణీత ప్రాంతం మొత్తాన్నీ కాంక్రీట్‌తో నింపే ప్రక్రియను ర్యాఫ్ట్ ఫౌండేషన్‌ విధానం అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే స్టీల్, కాంక్రీటుతో అత్యంత పటిష్ఠమైన, మందపాటి కాంక్రీట్‌ దిమ్మను పునాదిలో నిర్మించడమే. సాధారణంగా నేల లోతు నుంచి స్తంభాలు వేసి పునాది నిర్మించాలంటే అందుకు తగిన గుంతలు తవ్వాలి. బోర్లు వేసి స్టీలు పెట్టాలి. కాంక్రీట్‌ వెయ్యాలి. ఇందుకు కనీసం నెలన్నర వ్యవధి పడుతుంది. అదే ర్యాఫ్ట్ లో అయితే 3 రోజుల్లో పునాది వేయొచ్చు. ఫైల్‌ విధానంతో పోల్చితే దీనికి ఖర్చు ఎక్కువే. అయినా నిర్మాణం మాత్రం అత్యంత పటిష్ఠంగా ఉంటుంది.
రికార్డులకు
రాజధాని అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల అక్కడ నిర్మించే నిర్మాణాలన్నీ దశాబ్దాల పాటూ చెక్కు చెదరకుండా ఉండేలన్నది ప్రభుత్వధ్యేయం. అమరావతి నేల స్వభావానికి అనుగుణంగా భవన విస్తీర్ణం, ఎత్తుకు తగినట్లు పునాది ఎలా ఉండాలనేది తొలుత నిర్ణయించారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటిదాకా ఫైల్‌ ఫౌండేషన్‌ విధానంలో పనులు చేస్తున్నారు. సచివాలయం అత్యంత కీలక భవనం కావడంతో దానికి ర్యాఫ్ట్ ఫౌండేషన్‌లో పునాది వేస్తున్నారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ సచివాలయం కోసం ఆకృతుల్ని, నిర్మాణ ప్రణాళికల్ని సీఆర్‌డీఏకు ఇచ్చింది. కాంట్రాక్టరైన షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ఐదు టవర్లను ఒకే ర్యాఫ్ట్‌పై నిర్మిస్తోంది. ఇందుకు వేలమంది కార్మికుల్ని, వందల సంఖ్యలో యంత్రాల్నీ ఉపయోగిస్తున్నారు. సచివాలయానికి సంబంధించి 5 టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,890 కోట్లు ఖర్చు చేయబోతోంది. 250 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన సచివాలయంగా నిర్మాణంగానున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా 50 అంతస్తుల టవర్లను నిర్మిస్తారు. ఇందుకోసం 60, 40 టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్లు, 10 మీటర్ల వరకు వాడే హైడ్రాస్‌, కాంక్రీట్‌ వేసే నాలుగు పంపులు, 30 ట్రాన్సిట్‌ మిక్సర్లను పనిలో పెట్టారు. మరో ఆరు మిక్సర్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఈ నిర్మాణ పనులను ఏకధాటిగా 72 గంటల పాటు కాంక్రీటు పనులు జరుగనున్నాయి. ప్రపంచంలోనే 212 మీటర్ల ఎత్తైన సెక్రటేరియట్ భవనంగా నిలవనుంది.
ప్రత్యేకతలు
ఈ సెక్రటేరియట్‌కు హెలీకాప్టర్ ద్వారా చేరుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం పైభాగాన 15 ఫ్లోర్లో హెలీప్యాడ్‌ను నిర్మించనున్నారు.
ఈ సెక్రటేరియట్ 41 ఎకరాల్లో నిర్మిస్తారు
ఐదు టవర్ల ఏర్పాటు
మొత్తం 69.5లక్షల చదరపు మీటర్లు నిర్మాణం
నిర్మాణం అంచనా : 4వేల కోట్లు
టవర్ల నిర్మాణా ,2 షర్పోజి పల్లోంజి, 3,4 ఎల్అండ్ టి, 5వ టవర్ ఎన్.సి.సి

Related posts

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

Leave a Comment