అగస్టాలో జోక్యం చేసుకోలేదు


ఢిల్లీ, ఢిసెంబరు 31 : అగస్టా వెస్ట్ ల్యాడ్ హెలికాప్టర్ల కొనుగోళ్ళ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రస్తుత పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీల పాత్ర ఏమాత్రం లేదని కేంద్ర రక్షణశాఖ మాజీ మంత్రి ఎకె ఆంటోని అన్నారు. సోమవారం ఆంటోని మీడియాతో మాట్లాడుతూ రక్షణశాఖకు సంబంధించిన కొనుగోళ్ళలో వారిరువురూ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో అబద్ధాలను సృష్టిస్తోందని ఆయన అన్నారు. ఇలా సృష్టించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను తప్పడు పద్ధతుల్లో వాడుకుంటున్నదని ఆంటోనీ అన్నారు.