ప్రత్యేక హోదా పోరు కొనసాగుతుంది

ఢీల్లీ, జనవరి5: ప్రత్యేక హోదా పోరు కోనసాగుతుందని హోదా సాధన సమితి  ప్రకటించారు.  శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు విభజన హామీ అంశాలపై వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర సమస్యలపై హోంశాఖ మంత్రి సానుకులంగా స్పందించారని వారు తెలిపారు. ప్రత్యేక హోదా సాధనసమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలను అందజేస్తామని ఆమన తెలిపారు. ప్రత్యేకహోదా అంశంఏపీలో నిరుద్యోగ సమస్యతో ముడిపడి ఉందనీ, విభజన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఢీల్లీలోనే ఉండి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.