టీడీపీ గుండా గిరి? విష్ణువర్ధన్ రెడ్డి

విజయవాడ, జనవరి5: ఆంధ్రప్రదేశ్ బిజేపి అధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ ఇంటిపై దాడి చేసింది టీడీపీ గుండాలేనని ఏపీ బిజేపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రౌడీ రాజకీయాలు చేసే వారు కాలగర్భంలో కలిసిపోతారని ఆయన అన్నారు. పోలీసుల సహాకారంతోనే కన్నాపై హత్యయత్నం చేశారని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. దాడిచేసిన గుండాలను అరెస్టుచేసి బిజేపి నేతలకు రక్షణ కల్పించాలని ఆయన అన్నారు. జనవరి 18న రాయలసీమ పర్యటనకు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా  వస్తున్నారనీ, ఆయనను అడ్డుకోండి చుద్దామని విష్టువర్ధన్  సవాల్ విసిరారు.