వలసలు భారీగా ఉంటాయి

విజయవాడ, జనవరి5: జగన్ పాదయాత్ర ముగిసేలోపు వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత ఒకరు టీడీపీలో చేరబోతున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న చేప్పారు. జగన్ వ్యవహార శైలి నచ్ఛక టీడీపీలో చేరేందుకు మరింత మంది సిద్ధంగా ఉన్నారని అన్నారు.

బిజెపి చేసిన విమర్శలపై స్పందిస్తూ రాజకీయాల్లో విమర్శలు సహాజమే అయినా, మొదట వ్యక్తిగత విమర్శలు చేసింది బిజెపినే అన్నారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్నది బిజెపి పెయిడ్ ఆర్టిస్టులు అని ఆయన ఆరోపించారు.

SHARE