చొరబాటుదారులను మట్టి కరిపించారు

Share

శ్రీనగర్‌ డిసెంబర్ 31: జమ్ముకశ్మీర్‌ సరిహద్దు నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్ధాన్ చొరబాటుదారులను భారత సైనికులు నిలువరించారు.  నాగౌమ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద బారత పోస్టులపై దాడులు చేసేందుకు పాకిస్థాన్‌ బార్డర్‌ యాక్షన్‌ బృందం యత్నించింది. వెంటనే భారత బలగాలు ఎదురుదాడి చేసి పాక్‌కు చెందిన ఇద్దరు చొరబాటుదారులను మట్టి కరిపించారు.

మృతుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు  పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైనికులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పాకిస్ధాన్ చొరబాటుదారులు సాధారణ  సైనికులు ధరించే దుస్తులు ధరించి ఉన్నారని సైనికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్‌ఓసీని ఆనుకునిఉన్న దట్టమైన అడవుల ద్వారా భారత్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వారి కదలికలను గమనించి భారత  సైనికులు వెంటనే కాల్పులు ప్రారంభించారనీ, రాత్రంతా కాల్పులు కొనసాగాయని భారత ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు.

అక్రమంగా రావడానికి యత్నించిన మరికొందరు తప్పించుకుని ఉంటారని భావిస్తున్నారు. కొంత మంది చొరబాటుదారులు భారత సరిహద్దు రక్షణ దళం కంట కూడా పడ్డారని తెలియజేశారు. చొరబాటుదారుల మృతదేహాలను తీసుకెళ్లాలని పాకిస్థాన్‌ సైన్యానికి సమాచారం పంపినట్లు అధికారులు వెల్లడించారు. పాక్ ఆర్మీ ఈ చొరబాటుదారులకు, భారత సైన్యానికి జరుగుతున్న కాల్పుల సమయంలో పాక్‌ ఆర్మీ ఈ చొరబాటుదారులకు పూర్తి మద్దతు ఇచ్చిందని  అధికార ప్రతినిధి తెలియజేశారు.

 


Share

Related posts

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

somaraju sharma

ఇదీ మోదీ ధైర్యం

somaraju sharma

జైపూర్ : రాజస్థాన్ లో పోలింగ్ ప్రశాంతం

Siva Prasad

Leave a Comment