మొదటి రాత్రి పాలగ్లాసు వెనక ఇంత కహానీ ఉందా !

భారతీయ సంప్రదాయం లో పెళ్లి తర్వాత జరిగే ఘట్టంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. మొదటి రాత్రి చేసే అన్నిటిలో ఒక్కో దానిలో ఒక్కో మీనింగ్ ఉంది. తెల్లని దుప్పటిని బెడ్ పై వేయడం, పాలను తీసుకెళ్లడం , మల్లె పూలతో మంచాన్ని అలంకరించడం  రక రకా ల స్వీట్స్  పెట్టడం ఇవన్నీ కూడా సాంప్రదాయంలో భాగమే.

మొదటి రాత్రి పాలగ్లాసు వెనక ఇంత కహానీ ఉందా !
మొదటి రాత్రి గదిని తెల్లని సువాసన వెదజల్లే పూలతో అలంకరిస్తారు. ఎందుకంటే మల్లెపూలల్లో ఒక మత్తు పదార్థం ఉంటుంది. అందుకే మంచాన్ని, రూమ్ ని  మల్లెపూలతో , అలంకరిస్తారు. మొదటి రోజు రాత్రి నవ దంపతులతో పాలు తాగిస్తారు. పాలు ఇద్దరు చేరి సగం పంచుకుంటారు. జీవితాన్ని , జీవితంలో ఎదురయ్యే కష్టాలను చేరి సగం సమానంగా పంచుకుంటూ జీవితాన్ని సాఫీగా గడపాలని దాని అర్థం.. అంతేకాదండోయ్ ,పాలు తో వెళ్ళిన అమ్మాయి అమ్మగా అవుతుందని అందరి నమ్మకం. స్త్రీపురుషులు భార్యాభర్తల బంధం పేరిట మొదటిరాత్రి, తొలిసారి ఏకాంతంగా ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా వారిలో లోలోపల భయాందోళనలు కలుగుతూ ఉంటాయి. వీటి నియంత్రణకు పాలు ఎంతగానో దోహదం చేస్తాయి. పైగా పాలు త్వరగా జీర్ణం అవుతాయి. ఎందుకంటే పాలు పుష్కలమైన న్యూట్రిషన్‌ ఫుడ్‌. పాలు తాగడం వల్ల హ్యాపీ హార్మోన్స్‌ విడుదలవుతాయి. దీనివల్ల వారిలో ఆందోళన సర్దుకుని, హ్యాపీనెస్‌ వస్తుందని పరిశోధకులు తేల్చారు. అంతేకాకుండా, పాలల్లో ప్రోటీన్స్‌, కార్పోహైడ్రేట్స్‌, ఎమినో యాసిడ్స్‌, లాక్టోజ్‌
వంటివి ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా, రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. ఇకపోతే.. మగవారికి సెక్స్‌లో అవసరమైన ఈస్ట్రోజన్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్లు భారీగా విడుదలై దంపతుల మొదటిరాత్రి జీవితం మరింత మధురమైన, మరపురాని రాత్రిగా మిగిలిపోవడానికి పాలు ఎంతో దోహదం చేస్తాయని వారు చెపుతున్నారు.