చంద్రబాబుతో కలిస్తే ఫినిష్

కడప, జనవరి5: రాష్ట్ర ముఖ్యమంత్రి   చంద్రబాబుకు కౌంట్‌డౌన్ మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ నేత రామచంద్రయ్య అన్నారు. శనివారం కడపలో రామచంద్రయ్య మాట్లాడుతూ చంద్రబాబుతో పెట్టుకుంటే నిజంగానే ఫినిష్ అవ్వడం ఖాయమన్నారు. గతంలో చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్న వామపక్షాలు ఫినిష్ అయ్యాయని అన్నారు.   తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫినిష్ అయిందని గుర్తు చేశారు. పలు దేశాలు తిరిగి చంద్రబాబు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలన్నారు. ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.