ట్రంప్ ఎంతబాగా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి!

Share

విమ‌ర్శ‌ల‌కు కేర‌ఫ్ ఆడ్ర‌స్.. వెరైటీకి మారు పేరు.. అంటే ట‌క్కున గుర్తొచ్చే పేరు ట్రంప్. అమెరిక్ష అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ త‌న దూకుడుని పెంచాడు. ఇప్ప‌టికే క‌రోనా వ‌చ్చినా కూడా వ‌రుస ర్యాలీల‌తో క్యాంపెయిన్లు చేసిన ఆయ‌న‌. ఇప్పుడు మ‌ద్ద‌తుదారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు డాన్స్ తో మురిపించాడు. కొన్ని గంట‌ల ముందు త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. అంద‌రిని ఆక‌ర్శిస్తున్నాడు.

పోస్ట్ చేసిన‌ వీడియోలో హాలీవుడ్ పాటకు త‌న కాళ్ల‌ను క‌దుపుతూ స్టెప్పులేసిన ట్రంప్ అంద‌రిని న‌వ్వించారు. డ్యాన్స్ చేస్తూ తన మద్దతుదారుల్లో ఉత్సాహం నింపారు. ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని క్షణా‌ల్లోనే ఎంతో మంది దీన్ని వీక్షించారు. దాంతో ఇప్ప‌డు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఓట్! ఓట్! ఓట్! అనే క్యాప్షన్‌తో డొన‌ల్డ్ ట్రంప్ షేర్ చేసిన ఈ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో డొన‌ల్డ్ ట్రంప్ త‌ను పాల్గొన్న ర్యాలీల్లోని క్లిప్స్ ను వాడుకుని ఈ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో ట్రంప్ జేమ్స్ బాండ్ లెక్క వేసిన స్టెప్పులు త‌న అభిమానుల‌ను ఇట్టే క‌ట్టేస్తున్నాయి.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జో బైడెన్ గెలిచే అవ‌కాశం ఉంద‌ని ప‌లు స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ స‌మ‌యంలో చివ‌రి హ‌స్త్రంగా త‌న వీడియోని పోస్ట్ చేశారు ట్రంప్. దీంతో త‌న మ‌ద్ద‌తుదారుల‌కు ఉత్సాహం పెరిగింద‌ని ప‌లువురు చెబుతున్నారు. అలాగే మరో నాలుగేళ్ల కోసం.. ఇవాళే ఓటేయండంటూ కోరాడు.ఇంకో విష‌య‌మేమిటంటే ఈ వీడియోలో ఓట్, ఓట్, ఓట్ అని చెప్పారు కానీ.. త‌నకు వేయాల‌ని కానీ, తన పార్టీ అభ్యర్థులకు వేయాల‌ని కానీ కోర‌క‌పోవ‌డం విశేషం.

అధ్య‌క్ష ఎన్నికల నిబంధల ప్రకారం వీడియోపై నిషేధం పడకుండా ఆయ‌న జాగ్రత్తలు తీసుకున్నార‌ని ప‌లువురు చెబుతున్నారు. అయితే ఈ హ‌స్త్రాలు ఎంత‌మేర‌కు ప‌ని చేస్తాయో కొన్ని గంట‌లు వేచి చూడాలి. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోల్ ప్రారంభ‌మైంది. యూఎస్‌లోని రాష్ట్రాలన్నీ అక్క‌డి కాలమానం ప్రకారం.. నవంబర్ 3 ఉదయం నుంచే పోల్ ప్రారంభించారు. అయితే న్యూ హాంప్‌షైర్‌లో మాత్రం అర్ధరాత్రి 2 గంటల‌కు పోల్ మొద‌లైంది. ఇక్కడ ఓటింగ్‌తోనే పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఇది సాంప్ర‌దాయంగా వ‌స్తున్న విష‌యం‌.


Share

Related posts

బిగ్ బాస్ 4: ట్రెండ్ సెట్ చేస్తున్న అభిజిత్..!!

sekhar

NTR: ఎన్టీఆర్ గురించి రాజమౌళి తండ్రి సంచలన కామెంట్స్..!!

sekhar

SBI Offer: ఎస్బిఐ లో ఖాతా ఉంటే రూ.2 లక్షలు మీ సొంతం.. ఎలాగంటే..

bharani jella