ఇలా కూడా నిద్ర లేపొచ్చు.. మీకు తెలుసా?

Share

సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా ఎక్కువ సేపు నిద్ర పోతుంటే వారిని లేట్ అయింది లేవు అని నెమ్మదిగా నిద్ర లేపుతారు. అక్కడికి లేకపోతే కొంచెం గట్టిగా అరిచి చెబుతారు. కొంతమంది అప్పటికి కూడా నిద్ర లేకపోతే కొన్ని నీళ్ళు తీసుకొని వారి మొహాన కొట్టి లేపుతారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి తన లవర్ ని నిద్రలేపడానికి ఒక వినూత్న ప్రయత్నం చేశాడు. అది ఎలాగంటే…

తనను నిద్రలేపడానికి తన ఆఫీస్ కి వెళ్ళడానికి లేట్ అవుతుందని ఒక పాట రూపంలో పాడి ఆమెను నిద్ర లేపాడు. అయితే ఆ పాటను ఎలా పాడారో తెలుసా? ఆమె మొహం దగ్గర ఒక పెద్ద స్పీకర్ ను పెట్టి మై ద్వారా ఆ పాటలు పాడుతూ నిద్రలేపాడు. పెద్ద శబ్దం చేస్తూ పాట వినిపించడం తో ఒక్కసారిగా అతని లవర్ లేచి కూర్చుంది. కానీ అతను చేసిన పనికి అసహనం వ్యక్తం చేసింది. అయితే పక్కనున్న వాచ్ లో టైం చూసి బెడ్ పై నుంచి కిందికి దిగి, పక్కనే ఉన్న బెడ్ మీదకు అతనినీ తోసి వెళ్ళింది.

55 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో గురువారం రెడ్డిట్‌లో విడుదల కావడంతో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. విడుదలైన కొద్ది సమయానికి వేలల్లో వ్యూస్ రావడం, వేల సంఖ్యలో కామెంట్లతో ఈ వీడియో దూసుకుపోతుంది. ఈ వీడియోను చూసిన సదరు నెటిజనులు స్పందిస్తూ చాలా అద్భుతంగా పాట పాడడని, అతని స్వరం చాలా బాగుందనీ, కొందరు కామెంట్ చేశారు. మరికొందరైతే లవర్ ను ఇలా కూడా నిద్ర లేపుతారా? అన్నట్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది.


Share

Related posts

తుఫాను దెబ్బకు ఆగిన బిగ్ బాస్..? కంటేస్తెంట్స్ అంతా ఇంటి బయటకు…!

Teja

Bigg boss 4 : ఆఖరి వారం నామినేషన్స్ బిగ్ బాస్ చరిత్రలోనే సరికొత్తగా ఉండబోతున్నాయా?

Varun G

శ్రీ ముఖి – భాను శ్రీ మధ్య జరుగుతున్న బిగ్ వార్..! ఈ ఇద్దరు అందగత్తెలలో విజయం ఎవరిది..?

arun kanna