(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రోదసిలో బ్లాక్ హోల్ ఒకటి నక్షత్రాన్ని ఒక దానిని ఆరగించిన అరుదైన సంఘటనను నాసా ప్రయోగించిన భారీ టెలిస్కోప్ టెస్ రికార్డు చేసింది. కృష్ణ బిలం అని మనం పిలిచే బ్లాక్ హోల్స్ మన పాలపుంతతో పాటు అన్ని గెలాక్సీలలో ఉన్నాయి. పదార్ధం మనం ఊహించలేనంత్ ఎక్కువ పీడనానికి గురయినపుడు అది బ్లాక్ హోల్గా మారుతుంది. దాని గురుత్వాకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటుదంటే కాంతి కూడా దాని నుంచి తప్పించుకోలేదు. అందుకే బ్లాక్ హెల్ కంటికి కనబడదు. తనకు దగ్గరగా వచ్చిన దానిని దేనినయినా బ్లాక్ హోల్ మింగేస్తుంది.
అలానే దాదాపుగా మన సూర్యుడి పరిమాణంలో ఉన్న ఓ నక్షత్రం ఒక బ్లాక్ హోల్‌ను సమీపించింది. ఆ బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ శక్తి దానిపై పని చేయడం ప్రారంభించగానే అంత పెద్ద నక్షత్రం దుమ్ముదుమ్ముగా అందులో కలిసిపోయింది. ఆ క్రమంలో కొంత వాయువు రోదసిలో వ్యాపించింది. ఈ ప్రక్రియ జరుగుతున్నపుడు ఉద్భవించిన కాంతివంతమైన శక్తిని టెస్ రికార్డు చేసింది.