(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బాలీవుడ్లో అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి.. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఒకరినొకరు చొక్కా పట్టుకుని కొట్టుకున్నారు. సినిమాల్లో హీరో, విలన్ మధ్య జరిగే ఫైటింగ్ తరహాలో ఫైట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఎందుకు అక్షయ్, రోహిత్ శెట్టి కొట్టుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారా ? వివరాల్లోకి వెళితే.. రోహిత్ శెట్టి, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో ‘సూర్యవంశీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే హీరో, దర్శకుడి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. కొట్టుకున్నారంటూ ఓ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి కలిసి ఓ స్పూఫ్ చేసారు.
https://twitter.com/akshaykumar/status/1194155278960336896
అక్షయ్, రోహిత్ మధ్య గొడవలు అనే వార్తలను హీరోయిన్ కత్రినా కైఫ్ చూపిస్తుంది. తర్వాత అక్షయ్, రోహిత్ ఇద్దరూ కొట్టుకుంటుంటే.. సెట్లో పోలీస్ పాత్రల్లో నటిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ వాళ్లొచ్చి ఇద్దరినీ అడ్డుకుంటారు. తర్వాత ఇద్దరూ అలసిపోయి పడిపోయినట్లు ఫన్నీ వీడియోను రికార్డ్ చేశారు. ఈ వీడియోని నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసి సినిమాకు ఫ్రీ ప్రమోషన్ కూడా వస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.