(న్యూస్ ఆర్బట్ డెస్క్)
ఆ వీడియో చూస్తే ఒక్క క్షణం అవాక్కయిపోతాం. ఆ మొసలి దవడలకున్న శక్తి చూసి అమ్మో ఎంత బలం అనుకుంటాం. అయితే మొసలి దవడల మధ్య చిక్కుకున్నది ఏ జంతువో కాదు. పెద్ద పుచ్చకాయ. ఒక్క దెబ్బకు అంతపెద్ద కాయా నుజ్జయిపోతుంది. ఈ వీడియోను అమెరికాలోని ప్లారిడాలో ఉన్న సెయింట్ అగస్టీన్ ఎలిగేటర్ ఫాం జూ గురువారం ఫేస్బుక్లో పోస్టు చేసింది.
మొసళ్ల దవడలకున్న శక్తి మరే జంతువుకూ లేదు. 13 అడుగుల పైన పొడవున్న బాంబర్ ఆ శక్తి ప్రదర్శిస్తున్నది అని ఆ మొసళ్ల ప్రదర్శనశాల ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నది. బాంబర్ ఆ మొసలి పేరు. ఆన్లైన్లో ఈ వీడియో వైరల్ అయింది. చాలామంది పచ్చి మాంసాహారి అయిన మొసలి పుచ్చకాయ తినడంపై సరదా వ్యాఖ్యలు పోస్టు చేశారు.
https://www.facebook.com/TheAlligatorFarm/videos/650053675492330/?v=650053675492330
gfd