NewsOrbit
Right Side Videos

మియా భాయ్ పాటకు ఓవైసీ డ్యాన్స్!

ఔరంగాబాద్: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న ఎంఐఎం అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల తరుపున ఔరంగాబాద్‌లోని పైథాన్‌ గేట్‌ లో ర్యాలీ నిర్వహించిన హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ.. ప్రచారం తరువాత స్టెప్పులతో అదరగొట్టారు. తన ర్యాలీల్లో గంభీరంగా ప్రసంగించే ఓవైసీ ఔరంగాబాద్ ర్యాలీ అనంతరం ‘మియా భాయ్’ పాటకు డ్యాన్స్ చేశారు. వేదిక‌పై మాట్లాడిన త‌ర్వాత.. అక్క‌డ నుంచి వెనుదిరుగుతున్న స‌మ‌యంలో స్టేజ్ మెట్ల‌పై ఓవైసీ స్టెప్పులేశారు. ఓవైసీ డాన్స్ చూసి సభకు హాజరైనవారు కేరింతలు కొట్టారు. ఒవైసి డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మ‌హారాష్ట్ర‌లోని 288 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను, ఎంఐఎం పార్టీ 44 స్థానాల్లో పోటీ చేస్తున్నది. మహారాష్ట్రలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు వెలువడనున్నాయి.

 

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment