(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అదృష్టం అంటే ఇదేనేమో? ఎక్కడైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలతో బయటపడితే అదృష్టవంతువుడిరా అంటారు. అదే విధంగా ఈ చిన్నారినీ చాలా అదృష్టవంతురాలని చెప్పాలి. రెండు అంతస్తుల భవనం నుండి రెండేళ్ల చిన్నారి కిందకు పడిపోయింది. కానీ ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు. ఎందుకంటారా ? అదే సమయంలో అక్కడ ఉన్న ఒక యువకుడు ఆ బాలికను కిందపడకుండా ఒడిసి పట్టుకున్నాడు.
ఎబిసి న్యూస్ తెలిపిన సమాచారం ఈ ఘటన గత గురువారం టర్కీలోని ఇస్లాంబుల్లోని ఫాతిహ్ జిల్లాలో జరిగింది. ప్యూజి బజాత్ అనే 17ఏళ్ల యువకుడు నడుచుకుంటూ వెళతుండగా ఒక అపార్ట్మెంట్ రెండవ అంతస్తు నుండి పాప కిందపడటం చూసి ఒక్క ఉదుటున క్రికెట్ బాల్ పట్టుకున్న మాదిరిగా పాపను పట్టుకొని ప్రాణాపాయం కలగకుండా కాపాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు బజాత్ సమయస్పూర్తిని అభినందిస్తున్నారు.