(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బెంగళూరుకు చెందిన బాదల్ నంజుండస్వామి పలు ప్రధాన సమస్యలపై విన్నూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటాడు. అందులో భాగంగా ప్రధాన వీధుల్లో ప్రమాదంగా మారిన గోతుల గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యోమగామి అవతారం ఎత్తి వినూత్నంగా నిరసన తెలిపాడు.
గుంటల్లో మూన్ వాక్ చేసి ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. వీడియో చూస్తున్న వారు నిజమైన మూన్ వాక్ అని భ్రమపడతారు. అలా చూస్తుండగా, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలు కనిపించడంతో అది గుంటలు పడిన రోడ్డు అని తెలుస్తున్నది.
స్వతహాగా నటుడైన నంజుండస్వామి గతంలో ఒక పర్యాయం మొసలి వేషం వేసుకుని గుంతల్లో ఉండి తనదైన శైలిలో నిరసన తెలిపారు.
Hello bbmp? @BBMPCOMM @BBMP_MAYOR @bbm #thelatest #streetart #nammabengaluru #herohalli pic.twitter.com/hsizngTpRH
— baadal nanjundaswamy (@baadalvirus) September 2, 2019