NewsOrbit
Right Side Videos

పులి చేతికి చిక్కి.. బతికాడు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అడవిలో వెళ్తున్నప్పుడు పులి మీ వెంట పడితే.. ఆ సమయంలో ఎలా ఉంటుంది ? ఊహించుకోవడానికే భయం వేస్తుంది కదా. అదే గ్రామంలోకి వస్తే? ఒక వేళ నిజంగానే ఎవరికైనా అలాంటి పరిస్థితి ఎదురైతే తప్పించుకోవడం కష్టమే. పెద్దపులి పంజా విసిరిందంటే ఎవరూ తప్పించుకోలేరు. ఓ వ్యక్తి పులి  నోటికి ఆహార‌మ‌య్యేవాడు కాని చివ‌రి నిమిషంలో త‌ప్పించుకున్నాడు.

ఇటీవల కాలంలో జనావాసాల్లోకి పులులు, ఇతర క్రూరమృగాలు వస్తుండడం పరిపాటిగా మారింది. మహారాష్ట్రలోని భందారా జిల్లాలోని ఓ గ్రామంలోకి పెద్దపులి ప్రవేశించింది. హడలిపోయిన గ్రామస్తులు దాన్ని అడవిలోకి తరిమేసేందుకు ప్రయత్నించారు. దాన్ని పొలాల మీదుగా అడవిలోకి మళ్లించే ప్రయత్నంలో ఓ వ్యక్తి పులికి దొరికిపోయాడు. అతడ్ని ఒడిసిపట్టుకున్న పులి చంపేందుకు ప్రయత్నించింది. అయితే అంతటి విపత్కర పరిస్థితిలోనూ ఆ వ్యక్తి బుర్ర బాగా పనిచేసింది. వెంటనే చచ్చినశవంలా పడుకుండిపోయాడు. అతడిలో కదలిక లేకపోవడం గమనించిన పులి పంజాతో కొట్టి గాయపరిచే ప్రయత్నాన్ని విరమించుకుంది. ఇంతలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అతడ్ని వదిలేసి అడవిలోకి పరుగులు తీసింది. పులి వెళ్లిన మరుక్షణమే ఆ వ్యక్తి చెంగున లేచాడు. దీనికి సంబంధించిన వీడియోను అటవీ శాఖ అధికారి పర్వీస్ కస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

https://twitter.com/Tweetbis0n/status/1221078080778694656

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment