Right Side Videos

వడోదరకు మొసళ్ల బెడద

Share

వడోధర: గుజరాత్‌లోని వడోదర పట్టణంలో ఒక రోడ్డులో వరద నీటిలో సంచరిస్తున్న ఆరు అడుగుల పొడవు మొసలిని నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ రక్షించే ప్రయత్నం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వడోదరలో రికార్డు స్థాయిలో 500మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.
వీధుల్లో వరద నీరు ప్రవహిస్తోంది. నదుల నుండి వస్తున్న ప్రవాహంలో మొసళ్లు కొట్టుకొస్తున్నాయి. అవి జనావాసాల్లో కనిపించడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
వడోదర పట్టణ వీధుల్లో నిలిచిన వరద నీటిలో మొసళ్ల సంచారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
శనివారం సాయంత్రం వడోదరలో ఒక వీధిలో సుమారు ఆరు అడుగుల పొడవున్న మొసలి కనిపించడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం అక్కడకు చేరుకొని దాన్ని రక్షించారు. ఆ మొసలి నోటిపై ముందుగా ఖాళీ బస్తా విసిరి తరువాత దాని నోటిని తాడుతో కట్టి దాన్ని మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ వీధికి సమీపంలోనే మరో మూడు మొసళ్లను రక్షించినట్లు అధికారులు తెలిపారు. భుజ్ విమానాశ్రయంకు వెళ్లే మార్గంలో ఒక మొసలిపై నుండి గుర్తు తెలియని వాహనం వెళ్లడంతో అది మరణించింది.
జిల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో మొత్తం 15మొసళ్లు, నాలుగు పాములను రక్షించినట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు. నివాసాల మధ్య మొసళ్ల సంచారం ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది.

 

వీడియో ఎన్‌డిటివి సౌజన్యంతో……

 


Share

Related posts

అంబానీ ఇంట ‘అన్నసేవ’ పెళ్లి సందడి

somaraju sharma

బామ్మను మోసుకుంటూ…

Mahesh

బైక్‌పై గగనవిహారం!

Siva Prasad

Leave a Comment