NewsOrbit
Right Side Videos

జడ్జిని ముద్దుపెట్టుకున్న కంటెస్టెంట్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సోనీ ఛానల్‌లో ప్రసరామవుతున్న ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఐడల్’ సీజన్ 11 రియాల్టీ షోలో జడ్జికి ఊహించని అనుభవం ఎదురైంది. ఈ షోలో పాట పాడడానికి వచ్చిన ఓ కంటెస్టెంట్.. మహిళా జడ్జికి ముద్దుపెట్టాడు. దీంతో అక్కడున్నవారందరు షాకయ్యారు. కంటస్టెంట్ ప్రవర్తనతో కలత చెందిన జడ్జి కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే..ఇండియన్ ఐడల్ 11 షోలో ప్రముఖ గాయకులు అను మాలిక్, విశాల్ దడ్లానిలతో పాటు నేహ కక్కర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో పాడడానికి వచ్చిన ఓ 31 ఏళ్ళ గాయకుడు పాటపాడిన తరువాత తనను గుర్తుపట్టాల్సిందిగా జడ్జి నేహాను కోరాడు. దాంతో ఆమె స్టేజీ పైకి వెళ్లింది. అప్పుడు అతడు తన వెంట తీసుకొచ్చిన కొన్ని బహుమతులను ఆమెకు ఇచ్చాడు. ఆమె కృతజ్ఞతగా ఆ వ్యక్తిని కౌగిలించుకోగా.. ఒక్కసారిగా అతడు బలవంతంగా ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. దీంతో మాలిక్, విశాల్ దడ్లాని, యాంకర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యాంకర్ ఆదిత్య నారాయణ్ ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించారు. దీనికి సంబంధించిన వీడియోను సోనీ టీవీ అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

https://www.instagram.com/p/B3rAS-pFdcc/

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు కంటెస్టెంట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సింగింగ్ రియాల్టీ షోలో ‘ఇండియన్ ఐడల్’ సీజన్ 11 ఇటీవల మొదలైంది. ఎప్పటిలాగే ప్రముఖ గాయకులు అను మాలిక్, నేహా కక్కర్, విశాల్ దద్లానీలు జడ్జస్‌గా వ్యవహరిస్తున్నారు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment