26.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
Right Side Videos

బైక్‌పై లవర్స్ రైడింగ్

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విడియో చూస్తే 1998 సంవత్సవంలో విడుదలై సూపర్ హిట్ సాధించిన బాలీవుడ్ సినిమా గులామ్ గుర్తుకు వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే అమీర్‌ఖాన్, రాణి ముఖర్జీ జంటగా నటించిన ఈ చిత్రంలో ‘జాదు హై తేరా హీ జాదూ’ అనే పాటలో రాణి ముఖర్జీని అమీర్‌ఖాన్ తన బైక్ ముందు పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొబెట్టుకొని రైడ్ చేసే అధ్బుత రొమాంటిక్ సీన్ ఇక్కడ నేరుగా ప్రత్యక్షం అవుతోంది. ఈ సీన్ చూసిన వారికి ఆ పాట గుర్తుకు వస్తుంది.

అది సినిమా కాబట్టి చెల్లింది. నిజ జీవితంలో ఎవరైనా అలా చేస్తే సిగ్గు శరం లేదా అంటారు. ఈ జంటకు అది లేనట్టుంది. అమీర్‌ఖాన్‌ను ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో.

పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ రహదారిపై ఆ సినిమాలో మాదిరిగా బైక్‌పై యువతీ యువకుడు దూసుకుపోయారు. పెట్రోల్ ట్యాంక్‌పై యువతి కూర్చుని ఆ యువకుడిని గట్టిగా వాటేసుకుని బైక్ రన్నింగ్‌లో ఉండగా ముద్దులు కురిపిస్తూ రుయ్ రుయ్ మంటూ ముందుకు సాగారు.

మూడు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసభ్యకర విన్యాసాలతో సాగిన  వారి బైక్ రైడింగ్‌ను హెచ్‌జిఎస్ ధాలివాల్ అనే ఐపిఎస్ అధికారి ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.

మోటారు వెహికల్స్ చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్‌లు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆ ప్రేమికుల వైరల్ వీడియోతో పాటు గులామ్ సినిమాలోని ఆ పాట వీడియోను వీక్షకుల కోసం అందిస్తున్నాం.

సినిమాలోని పాట వీక్షించేందుకు కింద క్లిక్ చేయండి


Share

Related posts

విజయవాడలో ‘వర్మ’కు చుక్కెదురు

somaraju sharma

మీడియాతో మాటలొద్దు!

somaraju sharma

వయసు పైబడినా యువకుడే

somaraju sharma

Leave a Comment