(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మాంసం ముక్క ఒకటి ప్లేట్లో నుంచి పాక్కుంటూ కిందపడిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. దానికి కొందరు దెయ్యం చికెన్ అని పేరు పెట్టారు. అయితే అసలు అది నిజమైన వీడియోనా లేక సృష్టించినదా అన్న విషయంలో స్పష్టత లేదు.
తాజాగా కోసిన మాంసంలో న్యూరాన్లు చురుకుగానే ఉంటాయనీ, సోడియం తగిలితే అవి స్పందించి కండరాలను కదిలిస్తాయనీ సైంటిఫిక్ అమెరికన్ తెలిపినట్లు ఎన్డి టివి పేర్కొన్నది. ఉప్పులో. సోయాసాస్లో సోడియం ఉంటుంది.
ఈ వీడియోలో ఒక ప్లేట్లోని తాజా మాంసం ముక్క ఒకటి సడన్గా కదిలి పాక్కుంటూ వెళ్లి టేబిల్పైనుంచి కిందపడుతుంది. నేపధ్యంలో ఎవరో కెవ్వుమన్నట్లు వినబడుతుంది.
https://twitter.com/lizardtoess/status/1154973048937832448
నిజనిర్ధారణ వెబ్సైట్ స్నోప్స్ దీనిని పరిశీలించింది. ఈ వీడియో మొదట జూన్ నెలలో చైనాలో బయటకువచ్చినట్లు తేల్చారు. చాలా వెబ్సైట్లు దీనిని చికెన్గానే పేర్కొన్నాయి. హాంకాంగ్ న్యూస్ మాత్రం వీడియోలోని మాంసం ముక్క కప్ప మాంసం అయుండవచ్చని పేర్కొన్నది. ఈ మీమాంస ఇలా ఉండగా చాలామంది అసలు ఆ వీడియోనే నకిలీది పొమ్మంటున్నారు.