(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దారి తెలియక అడవిలో తప్పిపోయిన ఓ వృద్ధురాలని సీఆర్పీఎఫ్ జవాన్లు రక్షించారు. ఈ ఘటన ఒడిశాలోని న్యుపారాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. 70 ఏళ్ల ఓ బామ్మకు ఇంట్లో వాళ్లతో వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపంతో 2-3 రోజుల క్రితం ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. బాధతో నడుస్తూ అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది. అయితే ఇంటికి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించగా, ఆమెకు దారి తెలియలేదు. దీంతో ఆమె దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. తాగేందుకు మంచినీరు, తినేందుకు ఆహారం లేక అడవిలో బిక్కుబిక్కుమంటూ గడిపింది. అయితే కూంబింగ్ కోసం అటుగా వెళుతుగా సీఆర్పీఎఫ్ జవాన్లు వృద్ధురాలిని గుర్తించారు. తొలుత ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం డోలీని ఆ వృద్ధురాలిని దాదాపు 5 కిలోమీటర్ల దూరం మోసుకుంటూ వెళ్లి.. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సీఆర్పీఎఫ్ జవాన్లు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Team of #216Bn #CRPF found a 70 year old lady in Nuapara Odisha who was moribund in jungle after leaving home post altercation with family 2-3 days ago.
The team promptly rendered first aid and carried the lady on a stretcher for 5Km and handed her to her eagerly waiting family. pic.twitter.com/eInSde2pUV— ??CRPF?? (@crpfindia) September 14, 2019