33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
Right Side Videos

ఢిల్లీలో పోలీసుల వీధి పోరాటం!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

దేశ రాజధాని వీధుల్లో ఒక టెంపో డ్రయివర్‌ను పోలీసులు చితకబాదారు. వాయువ్య ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో జరిగిన ఈ సంఘటనను దారిన పోయేవారు వీడియో తీశారు. అది వైరల్‌గా మారింది. ఫలితంగా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.

పోలీసు వ్యాన్‌తో గ్రామీన్ సేవ టెంపో ఢీ కొట్టడంతో గొడవ మొదలయింది. పోలీసులు దాడి చేయడంతో టెంపో డ్రయివర్ కత్తి బయటకు లాగాడు. దానితో పోలీసులు రెచ్చిపోయారు. అతనిని రోడ్డుపై ఈడుస్తూ విచక్షణారహితంగా కొట్టారు. ఈ సంఘటనలో ఢిల్లీ పోలీసుల నిర్వాకాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ నియంత్రణలో పని చేస్తారు.

ఈ సంఘటనలో పోలీసుల ప్రవర్తన ప్రొఫెషనల్‌గా లేదని ఢిల్లీ పోలీసు విభాగం ప్రతినిధి అనిల్ మిత్తల్ పేర్కొన్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్లు సంజయ్ మాలిక్, దేవేంద్ర, కానిస్టేబుల్ పుష్పేంద్రలను సస్పెండ్ చేశారు.

వీడియో కోసం కింద క్లిక్ చేయండి:

Video Courtesy: The Quint


Share

Related posts

మొసలికి పుచ్చకాయ నైవేద్యం!

Siva Prasad

రెండు తలల పిల్లి !

Mahesh

సుస్మితాసేన్ వర్క్‌వుట్స్ వీడియో

somaraju sharma

Leave a Comment