(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త అన్నట్లు పులి ఇతర జంతువులను వేటాడితే ఆది వార్త కాదు, అదే పులిని కుక్కలు వేటాడి సంహరిస్తే అది సంచలన వార్తే.
ఇలాంటి ఓ ఘటన కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరగ్గా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మూకుమ్మడిగా అడవి కుక్కలు ఒక చిరుతను వెంటాడాయి. చిరుత తప్పించుకునేందుకు ఎంతగానో ప్రయత్నించింది. కుక్కలు పట్టు వదలక వెంటాడాయి. చివరికి కుక్కలదే పైచేయి అయింది. అన్నీ కలిసి చిరుతపులిమీద పడి రక్కడంతో అది ప్రాణాలు కోల్పోయింది.
వీడియో కోసం కింద క్లిక్ చేయండి: