(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గాల్లో పల్టీలు కొట్టిన కారులో నుంచి ఓ వ్యక్తి క్షేమంగా బయట పడ్డాడు. ఇటలీలోని మాంజాలో వరల్డ్ టూరింగ్ కార్ కప్ టోర్నీ శనివారం సందడిగా జరిగింది. వివిధ దేశాలకు చెందిన రేసర్లు ఇందులో పాల్గొన్నారు. అయితే, రేసింగ్ సందర్భంగా ఓ కారు అకస్మాత్తుగా గాల్లోకి లేచింది. అత్యంత వేగంతో దూసుకెళ్తున్న కారు.. అమాంతం గాల్లోకి ఎగిరి మూడు పల్టీలు కొట్టింది. అనంతరం రేసింగ్ ట్రాక్ బయట ఉన్న ఫెన్సింగ్ పై పడింది. కారు నుజ్జునుజ్జయింది. అయినా ఆ కారు నడుపుతున్న అలెక్స్ పెరోని అనే వ్యక్తికి స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా.. డ్రైవర్ అలెక్స్ కారులో నుంచి దర్జాగా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
We are all extremely relieved that Alex Peroni walked away from this crash during Race 1 in Monza.
He is currently under medical observation.#ItalianGP ?? #F3 pic.twitter.com/UdlcFSIqBH
— Formula 3 (@FIAFormula3) September 7, 2019