(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్నట్లు ఆ వ్యక్తి కూడా మందు కొట్టి జిరాఫీ ఎక్కాడు. ఈ వీడియో ఇప్పుడు అన్లైన్లో హల్చల్ చేస్తోంది. కజకస్థాన్లోని షిమ్కెంట్ జంతుప్రదర్శన శాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఆ వ్యక్తి జిరాఫీ ఎన్‌క్లోజర్ దగ్గరకు వెళ్లి కంచె ఎక్కాడు. అవతల పక్క నుంచున్న జిరాఫీ మెడ అందింది. అంతే ఆ మెడ పట్టుకుని దాని వీపు పైకి జారాడు. జిరాఫీ కొద్దిసేపు అతనిని భరించి తర్వాత కిందపడేసింది. ఇలా రెండు సార్లు జరిగింది. చివరికి అతను కంచె ఎక్కి ఇవతల పడ్డాడు.
టర్కిస్తాన్ టుడే అనే ఇన్స్టాగ్రామ్ పేజిలో అయిదు రోజుల క్రతం ఈ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియో వెంటనే వైరల్ అయింది.
https://www.instagram.com/p/B0h8ecrH91f/?utm_source=ig_web_copy_link