(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పారిస్‌లోని చాంప్స్ ఎలిసీస్ అవెన్యూలో ఆదివారం నిర్వహించిన బాస్టిల్లే డే వేడుకల సందర్భంగా ఫ్లైయింగ్ సైనికుడు చేసిన విన్యాసం చూపరులను విశేషంగా ఆకట్టుకున్నది. ఫ్రెంచ్ సైనికుడు తుపాకిని పట్టుకొని తన టర్బైన్ ఇంజన్ శక్తితో గాలిలో ఎగురుతూ విన్యాసం చేశాడు. ఈ వీడియోను జాతీయ దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహించిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Fier de notre armée, moderne et innovante. pic.twitter.com/DQvIfPolQf
— Emmanuel Macron (@EmmanuelMacron) July 14, 2019