(న్యూస్ అర్బిట్ డెస్క్)
నీళ్ళలో మొసలి బలం గురించి బోలెడు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ జంతువు నీటిలో ఎన్ని ఫీట్లు చేసినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. అదే బయట అయితే! మొసలి ఒకటి రోడ్డు పక్కన ఇనుప కంచెను దాటడం సెన్సేషన్ అయింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ మొసలి జంపింగ్ వీడియోకు లైక్లకు మీద లైక్లు వస్తున్నాయి.
ఫ్లోరిడాలోని ఒక నావికా స్థావరం వద్ద భద్రతకు వెసిన ఇనుప కంచె మీద నుండి ఒక పెద్ద మొసలి జంప్ చేసి అవతలకు వెళ్లిపోయింది. ఆ సమయంలో అటుగా కారులో వెళుతున్న క్రిస్టినా స్టీవర్ట్ అనే మహిళ ఈ వీడియోను తన ఫేస్బుక్లో షేర్ చేసింది. ఈ వీడియోను మూడు లక్షల మందికిపైగా వీక్షించగా వందలాది మంది షేర్ చేస్తున్నారు.
https://www.facebook.com/stinabear/videos/pcb.10205681431351652/10205681431111646/?type=3&theater