(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బాగా ఆకలి వేసినప్పుడు మాత్రమే జంతువులు వేటాడి తింటాయి. ఆకలి లేనప్పుడు వాటి ముందు ఒక మేకల మంద నిలబడినా వాటి జోలికి వెళ్లవు. అయితే, బాగా ఆకలితో అలమటించిన ఓ మొసలి..చేప కోసం నీటి నుంచి బయకొచ్చి.. దానిని తిన్నది. ఆస్ట్రేలియాలోని కాకాడు నేషనల్ పార్క్ లోని చెరువు వద్దకు ఇధ్దరు జాలర్లు చేపల వేటకు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి గాలానికి చేప చిక్కడంతో దానిని బయటకు లాగాడు. అయితే అదే సమయంలో నీటిలో నుంచి ఓ మొసలి బయటకు దూసుకొచ్చింది. దీంతో జాలర్లు చేపను వదిలి..పరుగులు తీశారు. అనంతరం మొసలి.. చేపను నోట్లో వేసుకుని తన ఆకలిని తీర్చుకుంది. అనంతరం మళ్లీ నీటిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.facebook.com/tourismtopend/videos/430585714221062/