(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఒక యువతి రోడ్డుపై విన్యాసాలు చేస్తూ ట్రాఫిక్‌పై అవేర్నెస్ కల్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పేరు శుభీ జైన్, ఇండోర్‌లో ఎంబిఎ చదువుతున్నది.
ఆ విద్యార్థిని రద్దీగా ఉన్నరహదారిపై స్టెప్పులు వేస్తూ ట్రాఫిక్ నియమాలపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నది. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించవద్దనీ, ద్విచక్రవాహనచోదకులు విధిగా హెల్మెట్, కార్లలో వెళ్లే వారు సీటు బెల్ట్ ధరించాలనీ వినూత్నంగా డ్యాన్స్ చేస్తూ అవగాహన కల్పిస్తున్న తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది. గత 15 రోజులుగా స్వచ్చందంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఆమె నిర్వహిస్తున్నది. ఈ యువతి నిర్వహిస్తున్న ట్రాఫిక్ అవేర్నెస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు హాట్సాఫ్ చెబుతున్నారు.
ట్రాఫిక్ నియమాలపై ఆ యువతి ఏ విధంగా అవగాహన కల్పిస్తుందో మీరూ చూడండి.