NewsOrbit
Right Side Videos

ఒక్క రూపాయికే ఇడ్లీ

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తమిళనాడులో ఓ బామ్మ రూపాయికే టిఫిన్ అందిస్తోంది. కోయంబత్తూరులోని వడివేలంపాలయం గ్రామానికి చెందిన 82 ఏళ్ల కమలాథల్ అనే బామ్మ ప్రతి రోజూ ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచి… ఇడ్నీలు తయారు చేస్తుంది. ఉదయం 6 గంటలకల్లా తన హోటల్ ను తెరుస్తుంది. ఈ హోటల్ లో కమలాథల్ ఒక్కో ఇడ్లీని రూపాయికే అందిస్తోంది. దీంతో రూ.10 పెట్టగానే కస్టమర్ల కడుపు నిండిపోతోంది. టిఫిన్ కోసం ఆమె ఇప్పటికీ కట్టెల పొయ్యినే ఉపయోగిస్తోంది. స్కూల్ కు వెళ్లే విద్యార్థులు కూడా ఈ బామ్మ వద్దే టిఫిన్ చేస్తున్నారు. ఆమె తయారు చేసిన ఇడ్లీ, సాంబార్, చట్నీ రుచిగా ఉండటంతో చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడే టిఫిన్ తినిపోతూ ఉంటారు. ఈ వయసులోనూ బామ్మ రుబ్బురోలును వాడుతున్నారు. తాను ఇప్పటికీ ఇంత బలంగా ఉండటానికి కారణం తన ఆహార అలవాట్లేనని ఆమె అంటున్నారు. గతంలో ఒక్కో ఇడ్లీ, బోండాను 50 పైసలకే అందించేది. అయితే సరుకుల ఖరీదు పెరగడంతో రూపాయికి అమ్ముతోంది. అందరూ తన టిఫిన్ ను మెచ్చుకుంటారని బామ్మ సంతోషం వ్యక్తం చేసింది.

‘ గత 30 సంవత్సరాలగా ఇడ్లీల వ్యాపారం చేస్తున్నాను. మాది ఉమ్మడి కుటుంబం. నా కుటుంబ సభ్యులంతా ఉదయాన్నే పొలానికి వెళ్లేవారు. ఇంట్లో ఒంటరిగా ఉండేదాన్ని. అస్సలు కాలక్షేపం అయ్యేది కాదు. అందుకే ఇడ్లీ వ్యాపారాన్ని మొదలెట్టాను. మొదట్లో ఇడ్లీ కేవలం రూ.50 పైసలకే అమ్మేదాన్ని. కానీ ఈ మధ్య అది చెల్లుబాటు కావడం లేదు. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఇడ్లీ రూపాయి చేయాల్సి వచ్చింది. ఇడ్లీపిండి కోసం ఆరు కిలోల బియ్యం, మినపప్పును నానబెట్టుకుంటాను. ప్రతిరోజూ సాయంకాలం వాటిని రుబ్బుతాను. దీనికి నాలుగు గంటల సమయం పడుతుంది. నేను చనిపోయే దాకా రూపాయికే ఇడ్లీ అమ్ముతా. ఎప్పటికీ ధర పెంచను’ అని ఈ బామ్మ పేర్కొంది. ప్రస్తుతం ఈ బామ్మకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బామ్మ కమలాథల్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ‘ఇలాంటి కథనాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. మనం జీవితంలో చేసే అన్ని పనులు కమలాథల్ చేస్తున్న సేవలో కొంత భాగానికి అయినా సరితూగుతాయా? అని అనిపిస్తోంది. కమలాథల్ ఇంకా కట్టెల పొయ్యినే వాడుతున్నట్లు నేను వీడియోలో గమనించా. ప్రజలెవరైనా ఆమె వివరాలు కనుక్కొని నాకు చెబితే కమలాథల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు, ఓ ఎల్పీజీ స్టవ్ ను కొనిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ప్రకటించారు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment